BREAKING
శివశంకర్ కాలనీలో వైసిపి గర్భ గర్వపు ప్రచారం సర్వేపల్లి రిజర్వాయర్‌లో 3.18 లక్షల చేప పిల్లల విడుదల రైతులకు 100% రాయితీపై పొద్దుతిరుగుడు విత్తనాల పంపిణీ ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. 3 రోజులు మద్యం షాపులు బంద్! స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులను గెలిపించండి: జిల్లా కార్యదర్శి అరిగెల సాయి పిలుపు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ.. చైనాపై ఘన విజయం సాధించిన భారత జట్టు! కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఆందోళనలు: సీపీఐ రాష్ట్ర నేత జంగాల అజయ్ కుమార్ పొన్నూరులో వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహావిష్కరణలో పాల్గొన్న......... ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఎన్నికల విధుల పర్యవేక్షణలో లోపాలు సహించేది లేదు : జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కూటమితోనే సంక్షేమాభివృద్ధి 40వ వార్డులో కార్పొరేటర్ గుణశేఖర్ సుడిగాలి పర్యటన - చివరి రోజు గ్రూలింగ్స్ పేట - ఎంజీఆర్ వీధిలో విస్తృత ప్రచారం - మేయర్ గా హేమలతకు మద్దతు కూటమి అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం గ్రామాల్లోని ప్రజలకు హోమియోవైద్యముపై అవగాహన కల్పిస్తున్న హోమియోవైద్యులు కరుణాకర్ హైలో ఓపెన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు జోరు.. క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్! వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి.. * ఆరోగ్య విస్తరణ అధికారి నల్లి రవికుమార్ *

19 కోట్ల వ్యయంతో నర్సింగ్ కాలేజీ నిర్మాణం - మంత్రి పొంగులేటి.

Select Suryaa Now
19 కోట్ల వ్యయంతో నర్సింగ్ కాలేజీ నిర్మాణం - మంత్రి పొంగులేటి.

*ప్రచురణార్ధం*

విదేశాల్లో నర్సింగ్ విద్యకు ఎంతో ప్రాధాన్యత

ఆశా ఫౌండేషన్ ద్వారా నర్సింగ్ విద్యార్థినులకు పుస్తకాలు, మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

ఖమ్మం/సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్...

(కిరణ్ కుమార్ ఆరిక )

నర్సింగ్ విద్యకు జర్మనీ లాంటి విదేశాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి సత్తుపల్లి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో ఆశా ఫౌండేషన్ ద్వారా నర్సింగ్ విద్యార్థినులకు పుస్తకాలు, మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జర్మనీ లాంటి విదేశాల్లో నర్సింగ్‌కు విపరీతమైన డిమాండ్ ఉన్నందున, మన విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలు పొందవచ్చనే ఉద్దేశంతో ఆ శిక్షణను కూడా కాలేజీల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన నర్సింగ్ కాలేజీని పూర్తిస్థాయిలో నిర్మించి ప్రారంభించడం జరిగిందని, సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన నర్సింగ్ కాలేజీని కూడా సుమారు రూ. 19 కోట్ల వ్యయంతో, అతి త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి అన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే నర్సింగ్ కాలేజీకి కావలసిన ఫ్యాకల్టీని కూడా పూర్తిగా సమకూర్చడం జరుగుతుందని అన్నారు.
డాక్టర్ తర్వాత అంతటి ప్రాధాన్యత నర్సింగ్ వృత్తికి ఉంటుందని, రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ కాలేజీకి, ప్రాంతానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకొని రావాలని విద్యార్థులను కోరారు. ఆశా ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు కావలసిన స్టడీ మెటీరియల్ అందజేయడం అభినందనీయమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సత్తుపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్ పాషా, కళాశాల ప్రిన్సిపాల్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.