BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ప్రజల్లో అపోహలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

Select Suryaa Now
ప్రజల్లో అపోహలు సృష్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

కొండాపూర్;రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని జిల్లా ఉపాధ్యక్షుడు అమ్రాది ఎల్లయ్య అన్నారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నిజమైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోయినట్లు ఆధారాలు చూపకుండా ఎన్నికల సంఘంపై అసత్య ప్రచారం చేయడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యగా అభివర్ణించారు.1952 నుంచి దేశంలో పలుమార్లు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు. ప్రస్తుతం కొత్తగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపట్టి ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రజల్లో అభద్రతాభావం సృష్టించడం సరికాదన్నారు.ఎస్‌ఐఆర్ ప్రధాన ఉద్దేశాలుకొత్త అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం.మరణించిన వారి పేర్లను తొలగించడం.ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన బహుళ ఓట్లను గుర్తించి నిబంధనల ప్రకారం సరిచేయడం.ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని, ఆధారాలు లేని ఆరోపణలు, అసత్య ప్రచారాలకు స్వస్తి పలకాలని అమ్రాది ఎల్లయ్య కోరారు.