BREAKING
యూకే ఆన్‌లైన్ సేఫ్టీ డేటా డిమాండ్లపై న్యాయపోరాటంలో ఓడిన మెటా, టిక్‌టాక్, ఎక్స్! సన్ ఫార్మాకు కేంద్రం భారీ షాక్ మందనపల్లిలో జలసిరి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తొలి ఆరు నెలల్లో ₹7.14 లక్షల కోట్ల ద్రవ్యలోటు: సీజీఏ (CGA) కీలక నివేదిక 2,52,397 మంది పింఛన్ దారులకు రూ. 111 కోట్లు పంపిణీ లలిత్ సూరి హాస్పిటాలిటీ భారీ విస్తరణ ప్రణాళికలు: ఐదేళ్లలో 1,000 కొత్త గదులు.. అహ్మదాబాద్‌లో లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్! భూ వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు మైకేల్ కోర్స్ మాతృ సంస్థ 'కాప్రి' షేర్ల సునామీ భట్టిప్రోలు 1వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న సాయిబాబా కేఎఫ్‌సీ, పిజ్జాహట్ ఫ్రాంచైజీల విలీనానికి సీసీఐ (CCI) ఆమోదం.. ఒకే గొడుగు కిందకు దేవయాని, సఫైర్ ఫుడ్స్ కార్యకలాపాలు! 'వికసిత్ భారత్' లక్ష్యంగా హై-లెవెల్ కమిటీ ఏర్పాటు! ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి గాత్రం సౌమ్యశ్రీ కి సెగ్మెంట్లో సాదర స్వాగతం ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ భారీ ఆర్థిక భరోసా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు!

సహన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Select Suryaa Now
సహన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కొల్చారం;సేవే లక్ష్యం.. సమాజమే కుటుంబం అనే ఆలోచనతో సహన సంస్థ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడు గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ దుబ్బగళ్ల స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.సమాజ సేవే లక్ష్యంగా సహన సంస్థ కొంగోడు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించిన సాలె సత్యనారాయణ డిగ్రీ పూర్తి చేసి, 2011 సంవత్సరం నుంచి వివిధ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తూ సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణ, విద్య ప్రాముఖ్యత, బాల్యవివాహాల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ సేవలందించారు.సాధన, స్కోప్, పద్మపాణి, కార్పెడ్, విహాన్, పీహెచ్‌ఎఫ్‌ఐ తదితర స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన అనుభవంతో సమాజానికి తన వంతు సేవ చేయాలనే సంకల్పంతో 2025 డిసెంబర్ 17న సహన ఆర్గనైజేషన్‌ను స్థాపించారు.

నాలుగు ప్రధాన అంశాలపై సేవలు

1. బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాల నివారణ.

2. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ.

3. మెరుగైన ఆరోగ్యం కోసం ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు.

4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం.

సమాజం మనకు గొడుగులాంటి నీడనిచ్చినప్పుడు, సమాజానికి మనం గొడుగులాంటి నీడనివ్వడం మన కర్తవ్యం” అనే ఆలోచనతో సత్యనారాయణ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.సహన సంస్థ సేవలు అభినందనీయం: సర్పంచ్ స్వామి ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దుబ్బగళ్ల స్వామి మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని సహన సంస్థ ఆధ్వర్యంలో ఉచ�