ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
బీబీనగర్,మేజర్, న్యూస్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాఘవాపురం, బ్రహ్మాణపల్లి గ్రామాల్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని,ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు.రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పొట్టోళ్ళ శ్యామ్ గౌడ్, వైస్ చైర్మన్ వాకిటి చంద్ర శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి,మండల అధ్యక్షులు సురకంటి సత్తిరెడ్డి, సర్పంచ్ సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు గడ్డం బాల్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్లు గండు బసవయ్య యాదవ్,బాలరాజు గౌడ్,గ్రామ పాలక వర్గం ఇతర ప్రజాప్రతినిధులు,నాయకులు,రైతులు, అధికారులు,పాల్గొన్నారు.