BREAKING
రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది డార్క్ హెవెన్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు విజయవంతంగా ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమా సంగీత దర్శకుడిపై వస్తున్న రూమర్లపై స్పందించిన చిత్ర యూనిట్ రెండు భాగాలుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమా? ట్రాఫిక్ జామ్ తట్టుకోలేకపోతున్నాం.. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానమే గొప్పది..తండ్రిని కోల్పోయిన విద్యార్థి చదువుకు రూ.25 వేల ఆర్థిక సాయం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే నూతన వ్యాపారాలకు ప్రోత్సాహం : కొలన్ హన్మంత్ రెడ్డి నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి: కూన శ్రీశైలం గౌడ్

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు–2026 సిబ్బందికి రెండవ విడత శిక్షణ

Select Suryaa Now
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు–2026  సిబ్బందికి రెండవ విడత శిక్షణ

గుడ్లవల్లేరు మేజర్ న్యూస్ : మండలంలో రెండవ సాధారణ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు–2026 నిర్వహణలో భాగంగా ఈ రోజు ఎన్నికల విధులకు నియమించబడిన సిబ్బందికి రెండవ విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి  బి. స్వర్ణలత తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఓట్ల లెక్కింపు పర్యవేక్షకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు విధానం, అనుసరించాల్సిన నియమ నిబంధనలు, లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధుల నిర్వహణలో పాటించాల్సిన ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్నం నుండి సాయంత్రం 6.00 గంటల వరకు గుడ్లవల్లేరు మండలంలో ఎన్నికల విధులకు నియమించబడిన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు రెండవ విడత శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణలో పోలింగ్ విధుల నిర్వహణ, బ్యాలెట్ పత్రాల వినియోగం, పోలింగ్ ప్రక్రియ, ఎన్నికల సామగ్రి నిర్వహణ, పోలింగ్ అనంతరం పూర్తి చేయాల్సిన విధులు, ఎన్నికల నియమ నిబంధనలపై అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎన్నికల విధులకు నియమించబడిన ప్రతి ఒక్కరూ శిక్షణలో వివరించిన అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వర్ణలత సూచించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గుడివాడ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.