BREAKING
ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ

7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి

Select Suryaa Now
7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి

హిమాయత్ నగర్ ,మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోని 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని, వారికి 7వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసులతో పాటు యూజీసీ వేతన స్కేళ్లు అమలు చేయాలని, క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగ భద్రత కల్పించాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (కాంట్రాక్ట్‌), తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎ. పరశురామ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ, కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సేవలను క్రమబద్ధీకరించిన నేపథ్యంలో తెలంగాణలోనూ అదే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ, కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ, అవసరమైతే ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, తమ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ మాట్లాడుతూ, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు. సీపీఎం నాయకుడు వి. భూపాల్‌ కాంట్రాక్ట్‌ అధ్యాపకుల డిమాండ్లకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.కాంట్రాక్ట్‌ అధ్యాపకులను క్రమబద్ధీకరించడంతో పాటు, కొత్త నియామకాలు చేపట్టే ముందు 7వ పీఆర్సీ, యూజీసీ వేతన స్కేళ్ల అమలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. 

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా పోరాటాన్ని కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు డాక్టర్‌ కరుణాకర్‌రావు, డాక్టర్‌ ధర్మతేజ, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బి. నిరంజన్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ భూమయ్య, డాక్టర్‌ డి. తిరుపతి, డాక్టర్‌ వినీత పాండే, డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు అధ్యాపక ప్రతినిధులు, సంఘం కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.