BREAKING
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉందా? మీ నిద్ర మరియు ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు ఇవే ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక యాప్ రాంలీలా మైదానంలో జరిగే ధర్నాకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి: కూన శ్రీశైలం గౌడ్

Select Suryaa Now
నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి: కూన శ్రీశైలం గౌడ్

జీడిమెట్ల మేజర్ న్యూస్ :రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా సుఖసంతోషాలతో జీవించాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఆకాంక్షించారు. చింతల్ డివిజన్ పరిధిలోని సంజీవయ్య నగర్ నల్ల పోచమ్మ ఆలయ ప్రాంగణంలో చింతల్, కుత్బుల్లాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాగంలో పాల్గొని నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ నల్ల పోచమ్మ అమ్మవారి కృపాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు విజయ్ గుప్తా, ప్రభు రాజు గుప్తా, శ్రీనివాస్ గుప్తా, కృష్ణ, రాజు, ఆంజనేయులు గుప్తా తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.