BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా

Select Suryaa Now
నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం  పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా

కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : నవంబర్ 3 న నాగోల్ శుభం ఫంక్షన్ హాల్ లో జాతీయ వాదుల సంగమం జరుగుతుంది అని పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్త తెలిపారు. శుక్రవారం ఆర్ కె పురం డివిజన్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు చెందిన పూర్వ విద్యార్ధి పరిషత్ నాయకులు కాసం వెంకటేశ్వర్లు కర్నాటక రాష్ట్ర బీజేపీ సహా ఇంచార్జిగా నియమించిన సందర్భంగా ఈ సదస్సు జరుగుతుంది అని ఆయన వివరించారు. 

దేశ సమైక్యత కోసం జాతీయ వాదులు అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఈ సంగమం దోహదపడుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి పూర్వ విద్యార్ధులు పెద్ద ఎత్తున ఈ సంగమానికి హాజరు కానున్నారు అని ఆయన తెలిపారు. దేశభక్తి, దైవభక్తి, సమాజ పరిరక్షణ కోసం జాతీయ భావాలు కలిగిన విద్యార్థులు ఈ సదస్సుకు హాజరు కావాలని చంద్రశేఖర్ గుప్తా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్ధి పరిషత్ నాయకులు అయిన సునీల్ బన్సాల్, కాసం వెంకటేశ్వర్లు తదితరులు హాజరు కానున్నారు అని ఆయన వివరించారు.