ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :దశలవారీగా జలమండలి ఉద్యోగుల సమస్యలను ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సుదీర్ఘకాలంగా పెండింగ్ లోఉన్న ప్రమోషన్లు నేడు జలమండలి ఉద్యోగులకు దక్కాయని ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కి, జలమండలి ఎండి అశోక్ రెడ్డీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఖైరతాబాద్, జలమండలి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జలమండలి పి&ఏ లోని 36 మంది ఉద్యోగులకు అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్లు ఇస్తూ పత్రాలను జె.ఏం.ఈ.యు గౌరవ సలహాదారు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మొగుళ్ళ రాజి రెడ్డి అందజేశారు.
ఈ సందర్బంగా మొగుళ్ళ రాజిరెడ్డి మాట్లాడుతూ 36 మందికి ఒకేసారి ప్రమోషన్లు దక్కడం జలమండలి చరిత్రలో మొదటిసారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని, సంబంధిత అధికారులతో నిరంతరం చర్చిస్తూ, ప్రమోషన్ల ప్రక్రియ సజావుగా పూర్తయ్యే వరకు ఉద్యోగుల పక్షాన నిలబడి జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ కృషి చేయడం జరిగిందన్నారు.
ఇతర సమస్యలపై దశలవారీగా ప్రత్యేక చొరవ తీసుకొని పరిస్కర్తానికి కృషి చేస్తూ ఉద్యోగ, కార్మికులకు అండగా ఉంటామని రాజిరెడ్డి తెలిపారు. బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ జలమండలి ఉద్యోగుల సమస్యల అంశంలో “ఉద్యోగుల సమస్యే మన సమస్య” అనే భావనతో జె.ఏం.ఈ.యు నిరంతరం కృషి చేస్తూ, సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న మొగుళ్ళ రాజిరెడ్డి నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి డైరెక్టర్ పర్సనల్ ఖాదర్, జె.ఏం.ఈ.యు ప్రధాన కార్యదర్శి టి.పి. రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రవాన్ కుమార్, ఈ. చంద్రశేఖర్, సైద్ అక్తర్ అలీ, బి.జైరాజ్, కె ఆనంద్ రెడ్డి, బి.నర్సింగ్ రావు, లక్ష్మణ్ యాదవ్, సైద్ హాసిం, గౌస్ పాషా, బి.మహేష్ తదితరులు పాల్గొన్నారు. జలమండలి యాజమాన్యంతో సంప్రదింపులకు వర్కింగ్ కమిటీ ఏర్పాటు
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి జలమండలి యాజమాన్యంతో సంప్రదింపులకు 9 మంది తోకూడిన వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశామని మొగుళ్ళ రాజిరెడ్డి ప్రకటించారు. ఇందులో సభ్యులుగా బొంతు రామ్మోహన్, మొగుళ్ళ రాజిరెడ్డి, టి.పి. రాఘవేంద్ర రాజ్, అల్లి శ్రావణ్ కుమార్, ఎండి. జహంగీర్, చంద్రశేఖర్, అక్తర్ అలీ, బి. జైరాజ్, శంకర్ ప్రకాష్ లు సభ్యులుగా ఉంటూ జలమండలి యాజమాన్యంతో సమన్వయం, సంప్రదింపులు జరిపి ఉద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తారని తెలిపారు.