BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు

Select Suryaa Now
హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు

జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్: హైదరాబాద్ నగరంలో  సాయంత్రం దాదాపు గంటపాటు కుండపోత వర్షం విరుచుకుపడింది. కేవలం గంట వ్యవధిలోనే ఏకంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాకాలంలో ఏకధాటిగా గంటపాటు వర్షం కురవడం, అలాగే అత్యధిక సమయం పాటు వర్షం పడటం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి కావడం విశేషం.

 ఈ వర్షాకాలంలో నగరంలో ఇప్పటివరకు 30 శాతం వర్షపాతం లోటు నమోదు కాగా, ఇప్పటివరకు కేవలం ఐదు సార్లు మాత్రమే భారీ వర్షాలు కురిసాయి. సాయంత్రం కురిసిన ఈ భారీ వర్షానికి నగరంలోని యూసుఫ్‌గూడ, శ్రీకృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. స్వల్ప వ్యవధిలోనే విపరీతమైన వర్షం పడటంతో డ్రైనేజీలు పొంగిపొర్లి, రోడ్లన్నీ చెరువులను తలపించాయి.

 పలు ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు చేరడంతో వాహన రాకపోకలు తీవ్రంగా స్తంభించిపోయాయి. సరిగ్గా ఆఫీస్ వేళలు ముగిసే సాయంత్రం సమయంలో వర్షం పడటంతో విధులు ముగించుకుని ఇళ్లకు తిరుగుపయనమైన ఉద్యోగులు, రోజువారీ కూలీలు, విధులకు వెళ్లి వస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, కళాశాలల నుంచి ఇళ్లకు వెళ్లే విద్యార్థులు రోడ్లపై నిలిచిన నీటిలో నడవలేక, తీవ్ర ఆటంకాలను ఎదుర్కొన్నారు.  

శ్రీకృష్ణానగర్ లోతట్టు ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాలు అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. నీటి ప్రవాహం కారణంగా ద్విచక్ర వాహనదారులు, బాటసారులు తీవ్ర అవస్థలు పడ్డారు. జీహెచ్‌ఎంసీ  సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించి, రద్దీని క్రమబద్ధీకరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.