యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే నూతన వ్యాపారాలకు ప్రోత్సాహం : కొలన్ హన్మంత్ రెడ్డి
నిజాంపేట్ మేజర్ న్యూస్ : యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా నూతన వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే నూతన వ్యాపారాలకు ప్రోత్సాహం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని కొలన్ హన్మంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన వింధు విలాస్ కిచెన్స్ & బాంక్వెట్స్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌ను సందర్శించి నిర్వాహకులు రామ్ గోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన సంస్థ ప్రజలకు నాణ్యమైన ఆహార సేవలతో పాటు మెరుగైన ఆతిథ్యాన్ని అందిస్తూ వ్యాపార రంగంలో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి గణేష్, డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, మైనారిటీ అధ్యక్షుడు షకీల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, జెస్సీ, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.