విజయవంతంగా ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర
పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన : క్యానం రాజ్యలక్ష్మి
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా వేలాది మంది ప్రజలు అనారోగ్యాల బారిన పడ్డారని, ఇక నైనా ఇక్కడ నుంచి దీనిని ఎత్తివేయాలని వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రకు పలువురు నాయ కులు, కార్యకర్తలతో తరలి వెళ్లి ఆయనతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యంతో పలువురు మృత్యు వాత పడ్డారని, మరి కొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. ఎన్నికల సమయంలో స్ధానికులకు కాంగ్రెస్ ఇచ్చిన హమీని మూడేళ్ళ వారి ప్రభుత్వ హయంలో కూడా నెరవేర్చలేక పోయిందని విమర్శించారు. ప్రజల ప్రాణా లతో చెలగాటమాడుతున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత కోసం ఎంపీ
ఈటల రాజేందర్ నాలుగు రోజులుగా
చేపట్టిన పాదయాత్ర ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఈ డంపింగ్ యార్డ్ ను వేరే చోటుకు తరలించాలని క్యానం రాజ్య లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో బీజేపీ సీనియర్ నాయకులు దొమ్మాటి సంతోష్ కుమార్, అడ్వకేట్ ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు