ఎన్నికల నేపథ్యంలో అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు
పామర్రు మేజర్ న్యూస్: రాబోయే ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా పామర్రు మండలంలో అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన గ్రామాలలో పోలీసులు శుక్రవారం కవాతు నిర్వహించారు. గుడివాడ డీఎస్పీ పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పామర్రు సర్కిల్ పరిధిలోని పోలీసులు ఈ కవాతు కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రమైన పామర్రు తో పాటు జుఝువరం గ్రామంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి పాల శ్రీనివాస్ మాట్లాడుతూ అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన ప్రాంతాలలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగే విధంగా ప్రజలలో భద్రతాభావాన్ని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా తమ శాఖ పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పామర్రు సీఐ చిన్ని నాగ శ్రీనివాస్, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పామర్రు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.