BREAKING
రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది డార్క్ హెవెన్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు విజయవంతంగా ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమా సంగీత దర్శకుడిపై వస్తున్న రూమర్లపై స్పందించిన చిత్ర యూనిట్ రెండు భాగాలుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమా? ట్రాఫిక్ జామ్ తట్టుకోలేకపోతున్నాం.. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానమే గొప్పది..తండ్రిని కోల్పోయిన విద్యార్థి చదువుకు రూ.25 వేల ఆర్థిక సాయం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే నూతన వ్యాపారాలకు ప్రోత్సాహం : కొలన్ హన్మంత్ రెడ్డి నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి: కూన శ్రీశైలం గౌడ్

కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి.

Select Suryaa Now
కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి.

గన్నవరం, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని బీవీఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ రూరల్ జడ్పీటీసీ అభ్యర్థి నూతలపాటి బాల కోటేశ్వరరావు (బాలా)తో పాటు కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలకు గాను రెండు స్థానాలను మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించామని, ఒక ఎంపీపీ స్థానాన్ని జనసేనకు ఇచ్చామని తెలిపారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. విజయవాడ రూరల్ జడ్పీటీసీ పరిధిలోని 14 గ్రామాల్లో ఐదు మైలవరం నియోజకవర్గంలో, తొమ్మిది గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాయని, ప్రతి గ్రామంలోనూ బీజేపీ అభ్యర్థి బాలా పోటీ చేస్తున్న కమలం గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో నియోజకవర్గంలోని 91 ఎంపీటీసీ, నాలుగు జడ్పీటీసీ స్థానాల్లో ఎక్కడా ఏకగ్రీవాల కోసం ప్రయత్నించలేదని, ఎవరినీ బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని, ప్రజల తీర్పును గౌరవించడమే తమ విధానమని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తనపై నమ్మకంతో 32,870 ఓట్ల మెజారిటీతో గెలిపించారని, రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన నియోజకవర్గాల్లో గన్నవరం తొమ్మిదో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.గన్నవరం జడ్పీటీసీ అభ్యర్థిగా కుమారస్వామి, బాపులపాడు నుంచి అప్పారావు, ఉంగుటూరు నుంచి తుమ్మల మోహనరూప విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకుని కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. అమరావతి అభివృద్ధికి రూ.52 వేల కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామీణాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో అశోక్ లేలాండ్ పరిశ్రమను తిరిగి తీసుకురావడానికి కృషి చేశానని, మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధితో బాపులపాడు ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం కుడి కాలువను ఏలూరు కాలువతో అనుసంధానం చేయడం ద్వారా గన్నవరం నియోజకవర్గంలో సుమారు 80 వేల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ కలుగుతుందని తెలిపారు. రామవరప్పాడు ప్రాంతంలో వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జీవో 30 ప్రకారం నియోజకవర్గంలో సుమారు వెయ్యి మంది పేదలకు రూ.100 కోట్ల విలువైన ఆస్తులను అందించామని, రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఖర్చులను సైతం ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు.విజయవాడ రూరల్ మండలంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు అధిక టీడీఎస్ స్థాయులు కలిగిన నీటిని వినియోగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులు గెలిస్తే గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరింత సమర్థవంతంగా పనిచేయవచ్చని తెలిపారు. రాజకీయాల్లో విలువలు, ప్రజాస్వామ్య పద్ధతులు ముఖ్యమని పేర్కొన్న యార్లగడ్డ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గన్నవరం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.