BREAKING
రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది డార్క్ హెవెన్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు విజయవంతంగా ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమా సంగీత దర్శకుడిపై వస్తున్న రూమర్లపై స్పందించిన చిత్ర యూనిట్ రెండు భాగాలుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమా? ట్రాఫిక్ జామ్ తట్టుకోలేకపోతున్నాం.. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానమే గొప్పది..తండ్రిని కోల్పోయిన విద్యార్థి చదువుకు రూ.25 వేల ఆర్థిక సాయం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే నూతన వ్యాపారాలకు ప్రోత్సాహం : కొలన్ హన్మంత్ రెడ్డి నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి: కూన శ్రీశైలం గౌడ్

జేగురుపాడులో వైసీపీ ప్రచార జోరు.. భారీ పాదయాత్ర

Select Suryaa Now
జేగురుపాడులో వైసీపీ ప్రచార జోరు.. భారీ పాదయాత్ర

                            ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి – యాదల స్టాలిన్

కడియం ,మేజర్ న్యూస్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడియం మండలం జేగురుపాడు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు యాదల స్టాలిన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ పాదయాత్ర నిర్వహిస్తూ ఇంటింటా ప్రచారం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన రెండు ఓట్లు వేసి, జడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి నాగ శివాజీతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులు వరసాల పూర్ణలత, గరగపర్తి రేవతి సింధులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఆకుల సుధాకర్, నాగిరెడ్డి మోహన్, షటర్ బాషా, హమీద్ బాషా, ఇబ్రహీం బాషా, కొల్లి నాని, సాక కిరణ్, బల్ల అన్నవరం తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.