ఉమ్మడి జిల్లా యోగాసనాల ఎంపికలు
మహబూబ్ నగర్ మేజర్ న్యూస్ -
తెలంగాణ రాష్ట్ర యోగ క్రీడా సంఘము ఆదేశానుసారం నవంబరు 1 న ఉదయం 9 గంటలకు మహబూబ్ నగర్ ఇండోర్ స్టేడియం లో ఉమ్మడి జిల్లా యోగ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా యోగ క్రీడా సంఘము అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్ కుమార్ గౌడ్, టి. చంద్రశేఖర్ తెలిపారు.
వయస్సు విభాగాలు:
18 సం॥, 21 సం॥లోపు, 21-25 సం॥లోపు, 25-30 సం॥లోపు, 30-35 లోపు, 35-40 సం॥లోపు, 40-45 పైబడిన మహిళా-పురుషులు యోగ ఆసనాలు పోటీలు మరియు ఎంపికలు ఉంటాయని తెలిపారు.అరుణజ్యోతి, పి.డి. యోగా సంఘము ఉపాధ్యక్షురాలు 9177252541 నంబరును సంప్రదించాలని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. క్రీడాకారులు కళాశాల నుండి వయస్సు నిర్ధారణ పత్రము మిగతావారు వారియొక్క ఎస్ ఎస్ సి పాస్ సర్టిఫికేట్ను తీసుకు రావాలని కోరారు.
ఎం.ఓం ప్రకాష్ మహబూబ్ నగర్