BREAKING
ఈ ఏడాది మూడు సినిమాలతో అలరించిన హీరో సూర్య.. చేతిలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి .. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాంబశివ రెడ్డి కు MCCBA వినతి పత్రం. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది డార్క్ హెవెన్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు విజయవంతంగా ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమా సంగీత దర్శకుడిపై వస్తున్న రూమర్లపై స్పందించిన చిత్ర యూనిట్ రెండు భాగాలుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమా? ట్రాఫిక్ జామ్ తట్టుకోలేకపోతున్నాం.. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానమే గొప్పది..తండ్రిని కోల్పోయిన విద్యార్థి చదువుకు రూ.25 వేల ఆర్థిక సాయం

తుఫాన్లతో రైతులు కుదేలు.. పరిహారంలో ప్రభుత్వ జాప్యం.:చెల్లుబోయిన వేణు ధ్వజం

Select Suryaa Now
తుఫాన్లతో రైతులు కుదేలు.. పరిహారంలో ప్రభుత్వ జాప్యం.:చెల్లుబోయిన వేణు ధ్వజం

కడియం, మేజర్ న్యూస్ : ప్రకృతి విపత్తులతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కూటమి ప్రభుత్వం పరిహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు విమర్శించారు. ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో కడియం ఆవ ప్రాంతంలో దెబ్బతిన్న వరి పంట పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు తుఫాన్లు వచ్చినప్పటికీ రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందించలేదని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రకృతి విపత్తులతో పంట నష్టం సంభవిస్తే రెండో పంట వేసేలోపే పరిహారం అందించే ప్రయత్నం చేసేవారని గుర్తుచేశారు. గతంలో పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించేదని, ప్రస్తుతం రైతులే ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి తీసుకువచ్చారని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లోపంతో అనేకమంది రైతులు బీమా చేయించుకోలేకపోయారని, అటువంటి రైతుల పంటలు దెబ్బతింటే వారికి ఎవరు అండగా నిలుస్తారని ప్రశ్నించారు.
పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి బీమా చేయించుకున్న, చేయించుకోని రైతులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా పరిహారం అందించడంలో జాప్యం చేయడం సమంజసం కాదన్నారు.
మరోవైపు వరి సాగు చేయవద్దంటూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి సరైన ప్రణాళికలు లేవని విమర్శించారు. ప్రస్తుతం బియ్యం ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ఏమి తిని జీవించాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలపై ఆర్థిక భారం అధికమైందన్నారు. వ్యవసాయ రంగం, నిత్యావసర ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని చెల్లుబోయిన వేణు ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నిడదవోలు నియోజకవర్గ పరిశీలకుడు గిరిజాల బాబు, మండల పార్టీ అధ్యక్షుడు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, జడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి నాగ శివాజీ, ఎంపీపీ అభ్యర్థి తాడాల రాజరాజేశ్వరి, ఎంపీటీసీ అభ్యర్థి పెంకె రామకృష్ణ, పార్టీ నాయకులు దాసరి శేషగిరి, గుడాల చంద్రరావు, శాఖ సతీష్, ఆకుల సుధాకర్, నాగిరెడ్డి మోహన్, అల్లంపల్లి శ్రీను, పలువురు రైతులు పాల్గొన్నారు.