BREAKING
విద్యార్థులు పరిశోధన నపుణ్యాభివృద్ధి సాధించాలి- 45 ఏళ్లుగా వైద్య సేవలు ఈ ఏడాది మూడు సినిమాలతో అలరించిన హీరో సూర్య.. చేతిలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి .. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాంబశివ రెడ్డి కు MCCBA వినతి పత్రం. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది డార్క్ హెవెన్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు విజయవంతంగా ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమా సంగీత దర్శకుడిపై వస్తున్న రూమర్లపై స్పందించిన చిత్ర యూనిట్ రెండు భాగాలుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమా?

విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలి

Select Suryaa Now
విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలి

స్టేషన్ ఘనపూర్, మేజర్ న్యూస్, పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్  మండలం మీదికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యా బోధన, వంటగది, తరగతి గదులు, గ్రంథాలయం, కంప్యూటర్లు, పాఠశాల పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, ప్రతిరోజూ సమయానికి పౌష్టికాహారం అందిస్తున్నారా? భోజనంతో పాటు గుడ్లు ఇస్తున్నారా? పాఠ్య పుస్తకాలు అందాయా? ఏకరూప దుస్తులు తీసుకున్నారా? ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలు సులభంగా అర్థమవుతున్నాయా? క్రీడల్లో శిక్షణ పొందుతున్నారా? మొదలగు విషయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించేందుకు విజ్ఞాన శాస్త్రం (సైన్స్) పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు సైన్స్ అంశాలను బ్లాక్‌బోర్డుపై వివరంగా రాసి కలెక్టర్ స్వయంగా బోధించారు.
విద్యార్థులకు ప్రతి సబ్జెక్టును సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతిలో బోధించిన పాఠ్యాంశాలను విద్యార్థులతో తిరిగి రాయించడం, చదివించడంతో పాటు నిరంతరం అభ్యాసం చేయించాలని తెలిపారు. సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారి అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
పాఠశాల తరగతి గదులను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, అవసరం లేని వస్తువులను తరగతి గదుల్లో నిల్వ చేయవద్దని తెలిపారు. పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలని, వారికి తగిన శిక్షణ అందించి, క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. వంటశాలలో గ్యాస్ పొయ్యి మీద మాత్రమే వంటలు చేయాలని స్పష్టం చేశారు.ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారిలో క్రమశిక్షణ, క్రీడా నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంపొందించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, పంచాయతీ కార్యదర్శి రాజు, తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; మోహన్, స్టేషన్ ఘన్పూర్, జనగామ జిల్లా