BREAKING
ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం 54వ డివిజన్ కార్పొరేటర్ గెలుపుకు కూటమినేతలు ప్రచారం ప్రచార ఘట్టం..జన ప్రభంజనం... -వైసీపీకి బుద్ధి చెప్పి..కూటమికి పట్టం కట్టండి -హోరెత్తించిన జేబీ ప్రచార ర్యాలీ -జనసంద్రంగా మారిన కొర్లగుంట జంక్షన్ -వేల సంఖ్యలో కదం తొక్కిన కూటమి నేతల -ముగిసిన కూటమి ప్రచార పర్వం నేటి పంచాంగం 30 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –30 అక్టోబర్ 2026 గెలుపు నీదనయ్య శంకర -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ కు మహిళలు ఆశీర్వాదం ఏసీ గదిలో గంటల తరబడి ఉంటున్నారా? మీ చర్మం మరియు కళ్లపై పడే తీవ్ర ప్రభావాలు ఇవి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించాలి ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ

45 ఏళ్లుగా వైద్య సేవలు

Select Suryaa Now
45 ఏళ్లుగా వైద్య సేవలు

తెలంగాణ బ్యూరో ప్రతినిధి :: వైద్య నిర్ధారణ రంగంలో నాలుగున్నర దశాబ్దాలుగా డాక్టర్‌ సురేందర్‌నాథ్‌రెడ్డి అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. 1981లో హైదరాబాద్‌లో ఒకే కేంద్రంతో ప్రారంభమైన విజయ డయాగ్నోస్టిక్స్‌ నేడు ఏడు రాష్ట్రాల్లోని 30 నగరాలకు విస్తరించి, సుమారు 170 కేంద్రాల ద్వారా ఏటా కోటి మందికి పైగా వినియోగదారులకు సేవలందించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. డాక్టర్‌ సురేందర్‌నాథ్‌రెడ్డి 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అభినందన సభలో అతిథులు ఆయన 45 ఏళ్ల విజయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.
రోగులకు అవసరమైన అన్ని రకాల వైద్య నిర్ధారణ పరీక్షలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో 1981లో విజయ డయాగ్నోస్టిక్స్‌ను ప్రారంభించారని తెలిపారు. అప్పట్లో పరీక్షల కోసం రోగులు వేర్వేరు కేంద్రాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను గుర్తించి, సమగ్ర సేవలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. నాణ్యత, కచ్చితత్వం, విశ్వసనీయతకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక వైద్య పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో సంస్థ క్రమంగా విస్తరించిందన్నారు.
వ్యాధులను ముందస్తుగా గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్సకు అవకాశం ఉంటుందన్న ఆలోచనతో డాక్టర్‌ రెడ్డి వైద్య నిర్ధారణ సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారని వక్తలు పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులు, ఆధునిక పరికరాలు, కచ్చితమైన పరీక్షా ఫలితాలు, అందుబాటు ధరలతో ప్రజల్లో విశ్వాసం సంపాదించారని కొనియాడారు.
సంస్థ అభివృద్ధిలో ఉద్యోగులను భాగస్వాములను చేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచిందన్నారు. 400 మందికి పైగా ఉద్యోగులకు కంపెనీలో వాటాలు కల్పించి, సంస్థ వృద్ధి ఫలాల్లో వారికీ భాగస్వామ్యం కల్పించారని గుర్తుచేశారు. తన వద్ద పనిచేసిన వైద్యులు, నిపుణులు సొంతంగా డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడం ద్వారా ఈ రంగంలో కొత్త వ్యాపారవేత్తల ఎదుగుదలకు తోడ్పడ్డారని తెలిపారు.
వ్యాపార విస్తరణకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతకు కూడా డాక్టర్‌ రెడ్డి ప్రాధాన్యమిచ్చారని అతిథులు ప్రశంసించారు. బాలికల విద్యకు చేయూతనివ్వడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఒకే కేంద్రంతో మొదలైన సంస్థను ఏడు రాష్ట్రాలకు విస్తరించడంలో ఆయన దూరదృష్టి, నిబద్ధత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయని అన్నారు. వైద్య నిర్ధారణ రంగంలో ఆయన నెలకొల్పిన ప్రమాణాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆకాంక్షిస్తూ 77వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో హైదరాబాద్​ టేబుల్​ టెన్నిస్ అసోసియేషన్​ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిప్రసాద్​ రెడ్డి , వివిధ రంగాల ప్రముఖులు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.