BREAKING
ఈ ఏడాది మూడు సినిమాలతో అలరించిన హీరో సూర్య.. చేతిలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులు టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి .. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాంబశివ రెడ్డి కు MCCBA వినతి పత్రం. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సరికొత్త చిరునామా "కాంటినెంట‌ల్‌" నవంబర్ 3 న జాతీయ వాదుల సంగమం పూర్వ విద్యార్ధి పరిషత్ నేత గుండా చంద్రశేఖర్ గుప్తా 7వ పిఆర్సి, యుజిసి వేతన స్కేళ్ళు అమలు చేయాలి విషాదం: కన్నుమూసిన ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ పాలమూరు బయోసైన్స్ ను సందర్శించిన వీసీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరతోనే జలమండలి ఉద్యోగులకు ప్రమోషన్లు నాలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంటెన్స్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది డార్క్ హెవెన్ హైదరాబాద్‌లో కుండపోత వర్షం: జలమయమైన శ్రీకృష్ణానగర్, యూసుఫ్‌గూడ రహదారులు విజయవంతంగా ముగిసిన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ సినిమా సంగీత దర్శకుడిపై వస్తున్న రూమర్లపై స్పందించిన చిత్ర యూనిట్ రెండు భాగాలుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమా? ట్రాఫిక్ జామ్ తట్టుకోలేకపోతున్నాం.. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానమే గొప్పది..తండ్రిని కోల్పోయిన విద్యార్థి చదువుకు రూ.25 వేల ఆర్థిక సాయం

నికర శూన్య కర్బన ఉద్గారాల సాధనకు సమగ్ర ప్రణాళికలు అవసరం

Select Suryaa Now
నికర శూన్య కర్బన ఉద్గారాల సాధనకు సమగ్ర ప్రణాళికలు అవసరం

విజ‌య‌వాడ‌, మేజర్ న్యూస్ : దేశంలో సుస్థిరమైన, తక్కువ కర్బన ఉద్గారాలు కలిగిన, వాతావరణ మార్పులను తట్టుకోగల పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిర్మాణ రంగం, పట్టణ ప్రణాళిక, రియల్ ఎస్టేట్, సుస్థిర మౌలిక వసతుల మధ్య సమన్వయం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్యాసంస్థ విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ).. నీడ్ మిషన్ సహకారంతో శుక్ర‌వారం ఎస్‌పీఏలో “నిర్మిత పర్యావరణంలో నికర శూన్య కర్బన ఉద్గారాలు: భవనాల నుంచి నగర ప్రాంతాల వరకు - వికసిత్ భారత్ @2047 లక్ష్యంగా నిర్మాణ శాస్త్రం, పట్టణ ప్రణాళిక, రియల్ ఎస్టేట్, సుస్థిర మౌలిక వసతుల సమన్వయం” అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహించింది.  ఈ సదస్సులో ప్రముఖులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులు, వృత్తి నిపుణులు, పరిశోధకులు, పారిశ్రామిక ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని దేశంలో సుస్థిర అభివృద్ధి, తక్కువ కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పులను తట్టుకోగల నిర్మాణ వ్యవస్థల అభివృద్ధిపై చర్చించారు. సదస్సులో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సుస్థిర పట్టణాభివృద్ధి, సమన్వయ పాలన, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల్లో పర్యావరణ పరిరక్షణ అంశాలను అంతర్భాగం చేయడం ద్వారా వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనకు దోహదపడుతుందని వివరించారు. ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో ప‌ర్యావార‌ణ స‌వాళ్ల‌ను ఎదుర్కొందాం: ఎస్‌పీఏ విజయవాడ ఆర్కిటెక్చర్ విభాగాధిపతి ప్రొఫెసర్ అమితవ సర్కార్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో నిర్మాణ రంగం, పట్టణ ప్రణాళిక, అనుబంధ రంగాల మధ్య సమన్వయం, పరస్పర సహకారం అవ‌స‌ర‌మ‌న్నారు. ఎస్‌పీఏ విజయవాడ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. రమేష్ శ్రీకొండ మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, నిర్మిత పర్యావరణ రంగంలో వినూత్న విధానాలను ప్రోత్సహించేందుకు సంస్థ కట్టుబడి ఉందన్నారు.  అన్నా విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ మాజీ డీన్ డాక్టర్ మోన్సింగ్ దేవదాస్.. సుస్థిర, పర్యావరణహిత అభివృద్ధి, నిర్మాణ పద్ధతుల ప్రోత్సాహంలో నిర్మాణ విద్య, పరిశోధనలు, వృత్తిపరమైన అనుభవాల పాత్రను వివరించారు. విభా సెక్రటరీ జనరల్ పి.ఏ.వివేకానంద మాట్లాడుతూ దేశ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు సమష్టి భాగస్వామ్యం, సంస్థల మధ్య సహకారం, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం ఎంతో అవసరమన్నారు. స్టూడియో చింతల అధిపతి, ఆర్కిటెక్ట్ దివాకర్ చింతల తన పరిశోధన ప్రాజెక్టులైన ఈపాజిటివ్ ల్యాబ్స్, అమరరాజా పరిశోధనా కేంద్రం, అమెరికాలో జెన్స్లర్ సంస్థ ద్వారా చేపట్టిన నియర్ జీరో కమర్షియల్ బిల్డింగ్ ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సదస్సులో ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వాణిజ్య భవనాలు, నగర ప్రాంతాలు, వ్యూహాలు, భావనలు అనే అయిదు అంశాలపై చర్చలు జరిగాయి. వాతావరణ మార్పులను తట్టుకోగల నగర ప్రాంతాల అభివృద్ధి, భవనాల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, సుస్థిర రవాణా వ్యవస్థలు, తక్కువ కర్బన ఉద్గారాలు వెలువడే నిర్మాణ సామగ్రి వినియోగం వంటి అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి అయ్యర్, డాక్టర్ అమితవ సర్కార్, డాక్టర్ జన్మజయ్ గుప్తా, డాక్టర్ ఆదినారాయణ, డాక్టర్ ప్రశాంత్ వర్ధన్, డాక్టర్ ఫైజ్, డాక్టర్ అనురాగ్, డాక్టర్ రాజీవ్ తదితరులు తమ పరిశోధన ప్రాజెక్టుల ఫలితాలను వివరించారు. విద్యార్థులు సైతం ఈ సదస్సుకు అనుబంధంగా తమ విద్యా సంబంధిత ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఎస్‌పీఏ విజయవాడ డీన్ అకడమిక్స్ డాక్టర్ ఎస్. వెంకట కృష్ణ కుమార్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని, సదస్సుకు హాజరైన అతిథుల‌కు కృతజ్ఞతలు తెలియ‌జేశారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.