ఎంపీడీవో గీతకు ఘన సన్మానం
కందుకూరు: కందుకూరు మండల పరిషత్ కార్యాలయానికి ఎంపీడీవోగా ఇటీవల బదిలీపై వచ్చిన గీతను శుక్రవారం ఏపీఓ రవీందర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి, మండల అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు అక్కెనపల్లి శ్రీనివాస్ వెంకటేష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్, మేజర్