శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ, లక్ష్మిపురం గ్రామం, గణపతి కాలనీలో నిర్వహించిన ప్రచారంలో కూటమి నాయకులతో బిజెపి నేత కోలా ఆనంద్ కలిసి పాల్గొనడం జరిగింది.
తొట్టంబేడు అభివృద్ధికి మరింత బలాన్ని చేకూర్చేందుకు,భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి వై కృష్ణయ్య కమలం గుర్తుపై ఓటు, జడ్పిటిసి అభ్యర్థి మునిరాజా నాయుడుకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో టిడిపి నాయకులు, జయచంద్ర నాయుడు, చలపతి నాయుడు , దసరదాఆచారి, కాసారం రమేష్ , వజ్రం కిషోర్ భారతీయ జనతా పార్టీ నాయకులు పుల్లయ్య నాయుడు, రమణ , పట్టణ అధ్యక్షుడు హరీష్ రెడ్డి, జివి అమర్నాథ్ , కోనేటి అయ్యప్ప , రాజు, చందు, రవి, కుమార్, కార్యకర్తలు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.
*వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి*