వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి
ఆత్మకూరు, మేజర్ న్యూస్, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడెప్పాడు జంక్షన్ వద్ద ఆత్మకూరు పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలపై పెండింగ్‌లో ఉన్న అపరాధ రుసుములను (చలాన్లను) ప్రతి ఒక్కరూ చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని ఆత్మకూరు ఎస్సై లక్ష్మీనారాయణ వాహనదారులను కోరారు. ఈ సందర్భంగా కొందరు వాహనదారులు ప్రభుత్వ యూపీఐ (యూపిఐ) చెల్లింపుల ద్వారా అపరాధ రుసుములను వెంటనే చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్; శ్రీనివాస్, ఆత్మకూరు, హనుమకొండ జిల్లా