BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

టిడిపి, జనసేన, బిజెపి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలి -- విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు

Select Suryaa Now
టిడిపి, జనసేన, బిజెపి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలి  -- విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు,మేజర్ న్యూస్ :ఇచ్చిన వాగ్దానాలను చేతల్లో చేసి చూపించగల కూటమి ప్రభుత్వ పక్షాన ప్రజలంతా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, కూటమి మేయర్‌ అభ్యర్ధి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. నవంబర్‌ 1వ తేదీన జరిగే పురపోరులో మంచి చేసేందుకు కంకణం కట్టుకుని ముందుకెళ్తోన్న కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల నుండి బరిలో నిలిచిన అభ్యర్థులందర్నీ ప్రజలు ఏకపక్షంగా గెలిపించాలని వారి విజ్ఞప్తి చేశారు. ఏలూరు పవర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూటమి భాగస్వామ్యపక్షాలైన మూడు పార్టీల నుండి కార్పొరేషన్‌లోని 62 డివిజన్‌ల ఎన్నికల బరిలో నిలిచిన కార్పొరేటర్‌ అభ్యర్ధులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. గడిచిన రెండున్నరేళ్ళలో అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ వచ్చిన కూటమి అభ్యర్ధుల గెలుపు ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరమని పేర్కొన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపుగా అటు రాష్ట్రాన్ని, ఇటు నగరాన్ని నడిపిస్తూ వస్తోన్న కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతివ్వాలని, నవంబర్‌ 1న మేయర్‌ అభ్యర్ధికి గాజుగ్లాసు గుర్తుకు, డివిజన్‌లలో కార్పొరేటర్‌ అభ్యర్ధులను సైకిల్‌, గాజుగ్లాసు, కమలం గుర్తులకు ఓట్లేసి అఖండ మెజార్టీలతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, జనసేన సీనియర్‌ నాయకులు నారా శేషు తదితరులు పాల్గొన్నారు.