BREAKING
నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి: కూన శ్రీశైలం గౌడ్ మహేష్ బాబు వారణాసి చిత్రం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో? టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన చర్చ నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరా పురపాలక ఎన్నికల పోలింగ్‌కు1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు . జర్నలిస్ట్ కాలనీలో వైభవంగా సంకటహర చతుర్థి పూజలు రైతుబజార్‌లో బాలకార్మికుడి గుర్తింపు వరద బాధితులకు ఆపన్నహస్తం సమస్యల పరిష్కారానికి నన్ను గెలిపించండి విశాఖను ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రగా తీర్చిదిద్దుతా వంశధార వరద బాధితులకు అండగా ఉంటాం.. ఎవరూ అధైర్యపడవద్దు! చింతల్ దర్గా షరీఫ్ ఉర్స్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కూటమిని ఓడించేందుకు ఓటుతో తిరగబడండి రామ్ చరణ్, సుకుమార్ ఆర్సీ 17 మూవీపై క్రేజీ అప్‌డేట్స్.. షూటింగ్ ఎప్పుడంటే? వార్డు మెంబర్ల హక్కులు కల్పించాలి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం

Select Suryaa Now
ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం

నరసరావుపేట,రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎస్పీ, ఇతర రెవెన్యూ, పోలీసు అధికారుల సమన్వయంతో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టం అత్యంత ప్రశాంతంగా ముగిసిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 659 జెడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు, 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902 నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. ఇందులో టీడీపీ నుంచి 2,078 జెడ్పీటీసీ, 22,013 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు పడగా, వైసీపీ నుంచి 1,817 (జెడ్పీటీసీ), 20,556 (ఎంపీటీసీ), జనసేన నుంచి 679 (జెడ్పీటీసీ), 4,609 (ఎంపీటీసీ), బీజేపీ నుంచి 255 (జెడ్పీటీసీ), 1,150 (ఎంపీటీసీ) నామినేషన్లు దాఖలైనట్లు స్పష్టం చేశారు.2021లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాలను నామినేషన్లు కూడా వేయనివ్వకుండా 1,045 నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపజేశారని, 322 అక్రమ కేసులు, 241 బెదిరింపులు, 160 దాడులు, 48 కిడ్నాప్‌లు, 3 హత్యలకు పాల్పడ్డారని గణాంకాలతో సహా వివరించారు. పుంగనూరులో 85కు 85 పంచాయతీలు, మాచర్లలో 74, పులివెందులలో 90, పూతలపట్టులో 46 చొప్పున బలవంతపు ఏకగ్రీవాలు చేశారన్నారు. ఇప్పుడు నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పినా ఆయన నామినేషన్లు వేసేందుకు ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా 59 కేసులు వేయడం, పంచాయతీల నిధులు రూ.12,600 కోట్లు దారి మళ్లించడం జగన్ నైజానికి నిదర్శనమన్నారు.నరసరావుపేట పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. 'అమృత్ 2.0' పథకం కింద రూ.23 కోట్లు, 'హామ్' కింద మున్సిపాలిటీకి రూ.33 కోట్లు మంజూరయ్యాయని, ఈ నిధులతో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, 16 సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ అభివృద్ధిలో భాగంగా రెండో కనుమ రహదారి, రోప్ వే, రెండో మెట్ల మార్గం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
పార్టీ కోసం కష్టపడే ప్రతి టీడీపీ కార్యకర్తకు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందిస్తామని డాక్టర్ అరవింద బాబు ప్రకటించారు. డోర్ టూ డోర్ కార్యక్రమంలో ప్రతి వెరిఫైడ్ ఇంటి సందర్శనకు 10 పాయింట్లు, రోజువారీ 50 ఇళ్లు పూర్తిచేస్తే 100 పాయింట్ల బోనస్, వారంలో వరుసగా 5 రోజుల లక్ష్యం పూర్తి చేస్తే 500 పాయింట్లు, కేటాయించిన ఇళ్లన్నీ 100 శాతం పూర్తి చేస్తే 1000 పాయింట్ల బోనస్ ఇస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో 1 నుంచి 10 ర్యాంకులు సాధించిన వారికి జీవితకాల పార్టీ సభ్యత్వం, అసెంబ్లీ స్థాయిలో 1 నుంచి 5 ర్యాంకర్లకు నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడించారు. మండల స్థాయిలో 1వ ర్యాంకు సాధించిన వారికి మైటీడీపీ పాస్‌పోర్ట్‌లో ప్రత్యేక ట్యాగ్ లభిస్తుందని, లక్ష్యం పూర్తి చేసిన వారందరికీ నారా లోకేష్‌తో ఫోటో సెషన్ ఏర్పాటు చేసి, ఆ ఫ్రేమ్‌ను నేరుగా వారి ఇంటికే డెలివరీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగి శెట్టి రామకృష్ణ, టౌన్ అధ్యక్షుడిగా ఫణి, వెంకటేష్, జనసేన నాయకులు షేక్ అద్రుఫ్, బెల్లంకొండ అనిల్, టిడిపి నాయకులు కపలవాయి విజయ్ కుమార్, కడియాల రమేష్ పాల్గొన్నారు.

కిరణ్ కుమార్, పల్నాడు జిల్లా ప్రతినిధి