BREAKING
ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉందా? మీ నిద్ర మరియు ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు ఇవే ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక యాప్ రాంలీలా మైదానంలో జరిగే ధర్నాకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు

జర్నలిస్ట్ కాలనీలో వైభవంగా సంకటహర చతుర్థి పూజలు

Select Suryaa Now
జర్నలిస్ట్ కాలనీలో వైభవంగా సంకటహర చతుర్థి పూజలు

 నిజాంపేట్ మేజర్ న్యూస్ జర్నలిస్ట్ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో సంకటహర చతుర్థి సందర్భంగా శుక్రవారం మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి రాకేష్ పంతులు దేవస్థానం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, పుష్పాలు, గరికతో అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మహాగణపతిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గోవిందరావు, ముక్క దేవేందర్ గుప్తా, దామెర జగదీశ్వర్ గుప్తా, మల్లికార్జున్, బంటి, మహిళా సభ్యులు, కాలనీ ప్రజలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.