BREAKING
ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉందా? మీ నిద్ర మరియు ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు ఇవే ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక యాప్ రాంలీలా మైదానంలో జరిగే ధర్నాకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు ఆరోగ్యానికి శ్రీరామరక్ష కివీ పండు.. చిన్న ఫలంలో ఇన్ని అద్భుతమైన పోషకాలు!

చింతల్ దర్గా షరీఫ్ ఉర్స్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

Select Suryaa Now
చింతల్ దర్గా షరీఫ్ ఉర్స్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్ :128వ చింతల్ డివిజన్ పరిధిలోని దర్గా షరీఫ్‌లో హజ్రత్ జిందా షాహ్ మదార్ (ఆర్.ఏ.) ఉర్స్-ఎ-షరీఫ్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చిరాగ్, కవ్వాలి కార్యక్రమాలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉర్స్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం గంగా జమునా తహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావం, మతసామరస్యంతో కలిసి మెలిసి జీవించాలని ఆకాంక్షించారు. మతాలకు అతీతంగా ప్రజల మధ్య ఐకమత్యం కొనసాగాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సోదరభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ఎర్వ శంకరయ్య, మసీదు కమిటీ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్ ఖాదర్, సలహాదారులు ఎండీ సిరాజ్, ఎండీ రషీద్, ఎండీ రియాజ్, కమిటీ సభ్యులు బాబుమియా, గౌస్ భాయ్, వాజిద్, షేక్ అలీ, సీనియర్ నాయకులు ఫెరోజ్, బస్వరాజ్, ఆకుల ప్రభాకర్ గుప్తా, జల్దా లక్ష్మీనాథ్, మంజూర్ అలీ, సతీష్ గట్టోజి, మెహరున్నిసా బేగం, జునైద్, శౌకత్ అలీ, రమ్మీ గౌడ్, అల్లావుద్దీన్, ఇర్ఫాన్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.