BREAKING
ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీరు తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే ప్రాచ్య కళాశాలలో ఘనంగా అష్టావధానం ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉందా? మీ నిద్ర మరియు ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు ఇవే ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక యాప్ రాంలీలా మైదానంలో జరిగే ధర్నాకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

Select Suryaa Now
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కొంపల్లి మేజర్ న్యూస్ :    వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నిర్వాహకుడికి సూచించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125వ గాజులరామారం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘యాం మొబైల్స్’ మొబైల్ షోరూంను బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. హమీద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని రిబ్బన్ కట్ చేసి వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ నూతనంగా వ్యాపార సంస్థను ఏర్పాటు చేసిన హమీద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో నూతనంగా అడుగుపెడుతున్న యువత, వ్యాపారవేత్తలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. స్థానిక ప్రాంతాల్లో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటవడం వల్ల ప్రజలకు అవసరమైన వస్తువులు, సేవలు అందుబాటులోకి రావడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. అనంతరం షోరూం నిర్వాహకుడు హమీద్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్‌రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, తెలంగాణ సాయి, ఇబ్రహీం ఖాన్‌తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.