BREAKING
ఉప్పలపాడులో వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం జోరు అందంతో కట్టిపడేస్తున్న ప్రముఖ నటి హన్సిక మోత్వానీ లేటెస్ట్ ఫోటోషూట్ ఈథా చిత్రంలో నటించడం గర్వంగా ఉంది: శ్రద్ధా కపూర్ మలకలపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదు: జానీ సైదా గ్రామంలో బాలల సమస్యలు గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలి వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా భూ సమస్యలపై ధర్నా ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి రాబోయే యాసంగి పంటకు కూడా రైతులకు పరిహారం చెల్లించాలి సాయం అందించకపోతే రైతులతో సెక్రటేరియట్ ముట్టడిస్తాం = మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: అక్కినేని వనజ ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి పట్టణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు నికర శూన్య కర్బన ఉద్గారాల సాధనకు సమగ్ర ప్రణాళికలు అవసరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే నైతిక విజయం: డాక్టర్ గోపిరెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపునకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ ఈటల రాజేందర్‌

Select Suryaa Now
జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపునకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ ఈటల రాజేందర్‌

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. డంపింగ్‌ యార్డును తరలించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని, నివేదిక రూపొందిస్తే అవసరమైన నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. 
ఈ సమస్య పరిష్కారం కోసం తాను చేస్తున్న ప్రయత్నాలకు సభకు హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 


జవహర్‌నగర్‌ పరిధిలోని చెన్నాపురంలో శుక్రవారం నిర్వహించిన పాదయాత్ర ముగింపు సభలో ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. పని లేక పాదయాత్ర చేయడం లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరును ప్రజలకు వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈటలకు నేతల మద్దతు: జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్యపై ఈటల రాజేందర్‌ చేస్తున్న పోరాటానికి సభకు హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు. 


స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆయనతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్‌రావు, శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, ముధోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నారాయణరావు పటేల్‌, ప్రదీప్‌ శ్రీనివాస్‌, వనపల్లి శ్రీనివాస్‌, గిరివర్ధన్‌, మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు భరత్‌, సామా రంగారెడ్డి, ఆచారి, మల్లారెడ్డి, మహేందర్‌, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, తాడూరు శ్రీనివాస్‌, భానుకా మల్లికార్జున్‌, సుధాకర్‌ గాండే, డాక్టర్‌ సమత, జె. సురేందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శిల్పారెడ్డి, రవి నాయక్‌, ఆర్‌.కె. శ్రీనివాస్‌, వడ్లపట్నం, పుల్లారావు, రాజు ముదిరాజ్‌, క్షమిత, డాక్టర్‌ మురళీధర్‌ గౌడ్‌, బొక్క నరసింహారెడ్డి, చంద్రారెడ్డి, బాబు, జోగారావు, ఏనుగు సుదర్శన్‌రెడ్డి, జిల్లాల తిరుమలరెడ్డి, పట్లోళ్ల విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు భారీగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడంతో చెన్నాపురం ఎక్స్‌రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో సభ అర్ధాంతరంగా ముగిసింది.