ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి రాబోయే యాసంగి పంటకు కూడా రైతులకు పరిహారం చెల్లించాలి సాయం అందించకపోతే రైతులతో సెక్రటేరియట్ ముట్టడిస్తాం = మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..
రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి పంట నష్టపరిహార సహాయం అందించకపోతే రైతులతో కలిసి సెక్రటేరియట్ ముట్టడిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాలలో ఉమ్మడి జిల్లాలో 15 మండలాలను ప్రకటించకపోవడం దారుణమని మండిపడ్డారు. 15 మండలాలలో రైతులు ప్రజలు సాగునీరు తాగునీరు అందించాలని ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువును ప్రకటించడం కాదని అధికారులతో సమీక్షలు జరిపి రైతులకు పంట నష్టపరిహారం అందించడంతో పాటు ప్రజలకు నిత్యవసర వస్తువులను కరువు సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కరువును ఎదుర్కొనేందుకు సమీక్షలు జరిపి రైతులకు పరిహారం అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం వల్ల ప్రజల ఇబ్బందులను తీర్చడం జరిగిందని గుర్తు చేశారు. హెచ్చరికలు జారీ చేయడం కాదని సహాయం అందించి చిత్తశుద్ధిలో నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అచ్చంపేట నియోజకవర్గం లోని ఎత్తైన ప్రాంతంలో చెంచు పెంటలు త్రాగునీరు అందక కుటుంబం కుటుంబం తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి పైప్లైన్ ద్వారా తాగునీటిని అందించామని తెలిపారు. సోలార్ వ్యవస్థను బలోపేతం చేసి పెంటలలో 24 గంటలు నీటిని అందించామని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటే ప్రస్తుత ప్రభుత్వం బేషజాలకు పోయి ప్రాజెక్టుల ద్వారా నీటిని కూడా నింపడం లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2300 చెరువులను ప్రాజెక్టుల నీటి ద్వారా నింపి భూగర్భ జలాలను పెంచడం వల్ల త్రాగునీటి సమస్య ఏర్పడలేదని ప్రస్తుతం అన్ని ప్రాంతాలలో త్రాగునీటి సమస్యలను ఉందన్నారు తాము పశుగ్రాసం కొరత ఏర్పడకుండా రైతులకు 50 శాతం సబ్సిడీతో విత్తనాలను సరిపడా చేశామని కరోనా సమయంలో కూడా ప్రజలను ఆదుకున్నామన్నారు. 13 లక్షల కిలోమీటర్లు పైప్ లైన్ ఏర్పాటు చేసి నీటి సమస్యను పరిష్కరించడం వల్ల 2014 - 15లో కోటి ఎకరాల వ్యవసాయం పెరిగిందని వివరించారు.. తెలంగాణ సాగునీటిపారుదల శాఖలో అడ్వైజరిగా ఆంధ్ర ప్రాంతం అధికారి ఉండటంవల్ల ప్రాజెక్టులు పూర్తి కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పనులను ముమ్మరం చేయాలని విద్యుత్ సమస్యలు పరిష్కరించడంతోపాటు సాగు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. పట్టాభద్రులైన ప్రతి ఓటరు తమ వివరాలను ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య మాజీ జడ్పిటిసి శ్రీశైలం కౌన్సిలర్లు గంగాధర్ జేపీ చారి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు షఫీ ఉల్లా ఖాన్, కేశవులు గౌడ్, శంకర్ గౌడ్, కురుమయ్య, కిషోర్ గౌడ్, టింకు తదితరులు పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్