చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదు: జానీ సైదా
నరసరావుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత వైఎస్ జగన్‌కు లేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు షేక్ జానీ సైదా అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్, పెన్షన్ల కోసం ఒకేరోజు రూ.5,825 కోట్లు అందించి కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిస్తే ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, మున్సిపల్ ఓటర్లు తమ రెండు ఓట్లను కూటమి అభ్యర్థులకే వేయాలని పిలుపునిచ్చారు.
మల్లికార్జున్ రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి.