ఏలూరు నగర అభివృద్ధికై బ్లాక్ బోర్డు గుర్తుకు ఓటెయ్యండి
ఏలూరు నగర అభివృద్ధికై బ్లాక్ బోర్డు గుర్తుకు ఓటెయ్యండి
ఏలూరు, మేజర్ న్యూస్: రాష్ట్రంలో వైసిపి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి,, తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రవ్యాప్తంగా మురికివాడలు, మధ్య తరగతి ప్రజల సమస్యలు, పరిష్కారం ఎందుకు కాలేదని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ, వివిధ సంఘాల తరఫున రిటైర్డ్ డిజిపి జె. పూర్ణచంద్రరావు విమర్శించారు.. ఏలూరు నగరంలోని ఏఐ బీఎస్పీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రిటైర్డ్ డిజిపి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం ఎస్ డి ఎఫ్ పోరాడుతుందని , ఏలూరు నగర మేయర్ అభ్యర్థి గుబ్బల నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వారి గుర్తు బ్లాక్ బోర్డ్ పై నగర ప్రజలు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మేయర్ అభ్యర్థి గుబ్బల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు నగరం అభివృద్ధి కోసం తనను ప్రజలంతా బలపరచాలని బ్లాక్ బోర్డు గుర్తుపై ఓటు వేసి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ లాల్, ఏఐబిఎస్వి జిల్లా అధ్యక్షులు ములకల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.