BREAKING
ఉప్పలపాడులో వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం జోరు అందంతో కట్టిపడేస్తున్న ప్రముఖ నటి హన్సిక మోత్వానీ లేటెస్ట్ ఫోటోషూట్ ఈథా చిత్రంలో నటించడం గర్వంగా ఉంది: శ్రద్ధా కపూర్ మలకలపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదు: జానీ సైదా గ్రామంలో బాలల సమస్యలు గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలి వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా భూ సమస్యలపై ధర్నా ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి రాబోయే యాసంగి పంటకు కూడా రైతులకు పరిహారం చెల్లించాలి సాయం అందించకపోతే రైతులతో సెక్రటేరియట్ ముట్టడిస్తాం = మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: అక్కినేని వనజ ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి పట్టణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు నికర శూన్య కర్బన ఉద్గారాల సాధనకు సమగ్ర ప్రణాళికలు అవసరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే నైతిక విజయం: డాక్టర్ గోపిరెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె

ఓంకార్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

Select Suryaa Now
ఓంకార్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు/బషీరాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన సోమ్‌శెట్టి జగదీష్ కుమారుడు ఓంకార్ అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు. ఓంకార్ మృతి విషయం తెలుసుకున్న ఆయన వెంటనే జీవన్గి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఓంకార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పంజుగుల శ్రీశైల రెడ్డి, నర్సిరెడ్డి, పి. నర్సింలు, వరాల శ్రీనివాస్ రెడ్డి, రవి శంకర్ పాటే, ఉపసర్పంచ్ జనార్ధనప్ప, దస్తయ్య గౌడ్, అంజిలప్ప తదితరులు పాల్గొన్నారు.