BREAKING
ఉప్పలపాడులో వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం జోరు అందంతో కట్టిపడేస్తున్న ప్రముఖ నటి హన్సిక మోత్వానీ లేటెస్ట్ ఫోటోషూట్ ఈథా చిత్రంలో నటించడం గర్వంగా ఉంది: శ్రద్ధా కపూర్ మలకలపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదు: జానీ సైదా గ్రామంలో బాలల సమస్యలు గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలి వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా భూ సమస్యలపై ధర్నా ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి రాబోయే యాసంగి పంటకు కూడా రైతులకు పరిహారం చెల్లించాలి సాయం అందించకపోతే రైతులతో సెక్రటేరియట్ ముట్టడిస్తాం = మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: అక్కినేని వనజ ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి పట్టణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు నికర శూన్య కర్బన ఉద్గారాల సాధనకు సమగ్ర ప్రణాళికలు అవసరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే నైతిక విజయం: డాక్టర్ గోపిరెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

Select Suryaa Now
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి  ప్రత్యేక ప్రాధాన్యత

డిండి. మేజర్ న్యూస్ :  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ గ్రామాల రూపురేఖలు మారుస్తున్నామని  అన్నారు. శుక్రవారం డిండి మండల పరిదిలోని  పెద్ద తండ, చెరుకుపల్లి  గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

*గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట*

డిండి మండలం పెద్ద తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించి, ఓపెన్ ఎయిర్ జిమ్ ను ప్రజలకు  అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం చెర్కుపల్లి గేటు వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. గ్రామంలోని రైతు వేదిక సమీపంలో యువత, గ్రామ ప్రజల ఆరోగ్యం, శారీరక దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ జిమ్‌ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

*పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం*

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. గతంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలతో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నామన్నారు.

దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అవసరమైన రహదారులు, తాగునీరు, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో సంబంధిత ప్రభుత్వ అధికారులు,  తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వేజన్న, పి ఆర్  ఏ ఇ ఇందిరా, గ్రామ కార్యదర్శులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు,  మండల పార్టీ అధ్యక్షులు ముత్యాల శశిధర్ రెడ్డి, గోనాకోల్ గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి,  సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, తూమ్ నాగార్జున రెడ్డి, పెద్ద తండ గ్రామ సర్పంచ్ కాట్రావత్ చిట్టి శంకర్, చెరుకుపల్లి సర్పంచ్ మీసాల రామచంద్రయ్య, మండల సర్పంచులు,  రేఖ్యనాయక్, శ్రీనునాయక్, బాధ్యనాయక్, శ్రావణకుమార్, తీజ్ నాయక్,  కాట్రావత్ శంకర్ నాయక్,  రమేష్ నాయక్, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,  రెండు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.