BREAKING
నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి: కూన శ్రీశైలం గౌడ్ మహేష్ బాబు వారణాసి చిత్రం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో? టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన చర్చ నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరా పురపాలక ఎన్నికల పోలింగ్‌కు1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు . జర్నలిస్ట్ కాలనీలో వైభవంగా సంకటహర చతుర్థి పూజలు రైతుబజార్‌లో బాలకార్మికుడి గుర్తింపు వరద బాధితులకు ఆపన్నహస్తం సమస్యల పరిష్కారానికి నన్ను గెలిపించండి విశాఖను ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రగా తీర్చిదిద్దుతా వంశధార వరద బాధితులకు అండగా ఉంటాం.. ఎవరూ అధైర్యపడవద్దు! చింతల్ దర్గా షరీఫ్ ఉర్స్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కూటమిని ఓడించేందుకు ఓటుతో తిరగబడండి రామ్ చరణ్, సుకుమార్ ఆర్సీ 17 మూవీపై క్రేజీ అప్‌డేట్స్.. షూటింగ్ ఎప్పుడంటే? వార్డు మెంబర్ల హక్కులు కల్పించాలి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

40వ డివిజన్‌లో ఎంపీ కేశినేని చిన్ని విస్తృత ప్రచారం

Select Suryaa Now
40వ డివిజన్‌లో ఎంపీ కేశినేని చిన్ని విస్తృత ప్రచారం

విజయవాడ పశ్చిమ మేజర్ న్యూస్ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్‌లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బుద్ధా వెంకన్న, టీడీపీ–జనసేన మద్దతుతో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి పగడాల వెంకట రామకృష్ణతో కలిసి డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఎంపీ చిన్ని పిలుపునిచ్చారు. మూడు పార్టీల కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేసి పగడాల వెంకట రామకృష్ణను గెలిపించాలని సూచించారు. అదేవిధంగా 40వ డివిజన్‌లో నెలకొన్న స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అభ్యర్థి పగడాల వెంకట రామకృష్ణకు సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.