BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

Select Suryaa Now
పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, మేజర్ న్యూస్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు అయ్యేలా పార్టీ నాయకులు, ఇన్‌చార్జులు సమన్వయంతో కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సూచించారు. ప్రతి పట్టభద్రుడికి ఫోన్ చేసి ఓటరుగా నమోదు చేసుకున్నారా లేదా తెలుసుకోవాలని, అర్హులైన వారిని నమోదు ప్రక్రియలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంపై శుక్రవారం తాండూరులోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి పంజుగుల శ్రీశైల్ రెడ్డి, అన్ని మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య, సీనియర్ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అనుసరించాల్సిన విధానాన్ని నాయకులకు వివరించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో నమోదైన కొత్త ఓటర్ల వివరాలను సమీక్షించడంతో పాటు నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించుకుంటూ అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో చొరవ తీసుకోవాలని సూచించారు. శనివారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తాండూరు ఇన్‌చార్జి విప్లవ్ కుమార్ తాండూరుకు రానున్న నేపథ్యంలో, ఇప్పటివరకు జరిగిన ఓటరు నమోదు వివరాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై నాయకులు, ఇన్‌చార్జులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని రోహిత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అన్ని మండలాలు, పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.