గాత్రం సౌమ్యశ్రీ కి సెగ్మెంట్లో సాదర స్వాగతం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్:
రాష్ట్ర మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు దీవెనలతో మండల కేంద్రమైన భట్టిప్రోలు లోని మూడవ సెగ్మెంట్ కు కూటమి బలపరిచిన, ఎంపీపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి గాత్రం సౌమ్యశ్రీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామానికి చెందిన తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలకు చెందిన నాయకులు ప్రజలు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సౌమ్య కోరారు. సెగ్మెంట్లోని సోదర సోదరీమణులు తనను ఆశీర్వదించి విజయం చేకూర్చి మండల పరిషత్ కు పంపిన యెడల గ్రామ మండల అభివృద్ధికి తనవంతుగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు సహకారంతో ముందుకు సాగుతానని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులుగా పోటీ చేస్తున్న నక్క శ్రీనివాస్ రావుకు, ఎంపీటీసీ సభ్యురాలుగా తనకు కేటాయించిన సైకిల్ గుర్తులపై తమ పవిత్రమైన ఓటు ముద్రను వేసి గెలిపించవలసిందిగా సౌమ్యశ్రీ కోరారు.