భట్టిప్రోలు 1వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న సాయిబాబా
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు గ్రామంలోని అద్దేపల్లి ఒకటవ సెగ్మెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపీటీసీగా కత్తి కృష్ణ, జడ్పిటిసి సభ్యులుగా నక్క శ్రీనివాస్ రావులతో ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూను గుంట్ల సాయిబాబా పాల్గొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించమని అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వంలో భట్టిప్రోలు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వేమూరు శాసనసభ్యుల పర్యవేక్షణలో మండల పరిధిలోని గ్రామాలు అభివృద్ధి చెందటంలో ముందున్నాయన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్లు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్నదని అదేవిధంగా మండల పరిధిలో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధిస్తే డబల్ ఇంజన్ సర్కారుకు తోడుగా ఉంటుందని సాయిబాబా తెలిపారు.ఈ కార్యక్రమంలో వందలాది కార్యకర్తలు అభ్యర్థుల్ని అనుసరించి ప్రచార కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహించారు. ఈ ప్రచారంలో గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.