BREAKING
ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి పట్టణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు నికర శూన్య కర్బన ఉద్గారాల సాధనకు సమగ్ర ప్రణాళికలు అవసరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే నైతిక విజయం: డాక్టర్ గోపిరెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె 2,23,183 పెన్ష‌న్ల‌కు రూ. 96.93 కోట్ల ల‌బ్ధి - పంపిణీ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యూహాలపై వైసీపీ అభ్యర్థులకు దిశానిర్దేశం కడియంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో కీలక సమావేశం రామాలయం శివాలయం నిర్మాణానికి భూమి పూజ ఉమ్మడి జిల్లా యోగాసనాల ఎంపికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు–2026 సిబ్బందికి రెండవ విడత శిక్షణ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గోరంట్ల ఇంటింటి ప్రచారం ఎన్నికల నేపథ్యంలో అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు తుఫాన్లతో రైతులు కుదేలు.. పరిహారంలో ప్రభుత్వ జాప్యం.:చెల్లుబోయిన వేణు ధ్వజం కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి. జేగురుపాడులో వైసీపీ ప్రచార జోరు.. భారీ పాదయాత్ర

'వికసిత్ భారత్' లక్ష్యంగా హై-లెవెల్ కమిటీ ఏర్పాటు!

Select Suryaa Now
'వికసిత్ భారత్' లక్ష్యంగా హై-లెవెల్ కమిటీ ఏర్పాటు!

సూర్య బిజినెస్ డెస్క్: దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. 'వికసిత్ భారత్ 2047' లక్ష్యానికి అనుగుణంగా దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని ప్రపంచ స్థాయి పోటీకి తగినట్లుగా తీర్చిదిద్దేందుకు ఒక ఉన్నత స్థాయి బ్యాంకింగ్ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన ఈ ప్రతిపాదనకు రూపూనిస్తూ, మాజీ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (CVC) సురేష్ ఎన్. పటేల్ నేతృత్వంలో ఈ ప్రతిష్టాత్మక హై-లెవెల్ కమిటీని కేంద్రం కొలువుదీర్చింది. ఆరు నెలల కాలపరిమితితో ఏర్పాటైన ఈ కమిటీ బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులపై తన నివేదికను సమర్పించనుంది.

ఈ కమిటీలో కీలక నిపుణులకు చోటు కల్పించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము, ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎన్.ఎస్. విశ్వనాథన్, ఇండియన్ బ్యాంక్ మాజీ ఎండీ అండ్ సీఈఓ పద్మజ చుందురు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం జాయింట్ సెక్రటరీ ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. బ్యాంకింగ్ రంగంలో నిర్మాణాత్మక, నియంత్రణపరమైన, సంస్థాగత మరియు శాసనపరమైన సంస్కరణలను సూచించడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా బ్యాంకింగ్ వ్యవస్థను సంసిద్ధం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉండనుంది.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో కార్యాచరణ సామర్థ్యం, మూలధన అవసరాలు, ప్రాధాన్యతా రంగ రుణాల (PSL) విధానం మరియు లీడ్ బ్యాంక్ స్కీమ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై ఈ కమిటీ ప్రధానంగా దృష్టి సారించనుంది. దేశ ఆర్థికాభివృద్ధికి తగినట్లుగా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం, దీర్ఘకాలిక మూలధన సవాళ్లను అధిగమించడం మరియు భవిష్యత్ శ్రామిక శక్తి కోసం సరికొత్త నైపుణ్యాలను పెంపొందించే వ్యూహాలను కూడా కమిటీ సిఫారసు చేయనుంది. ఆర్థిక స్థిరత్వం మరియు వినియోగదారుల రక్షణకు పెద్దపీట వేస్తూ కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం భారతీయ బ్యాంకింగ్ రంగానికి ఒక దిక్సూచిగా మారుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.