BREAKING
13 మంది పిల్లల పెంపకంపై ఎలాన్ మస్క్ కీలక స్పష్టత: ఎంతమంది సిబ్బంది ఉంటారంటే? అబుదాబిలో భారతీయ చేనేత వస్త్ర వైభవాన్ని చాటిన ఎంబసీ! 118 ఏళ్ల చరిత్ర కలిగిన పెన్స్ కేవ్ అమ్మకానికి: అమెరికాలో 1400 ఎకరాల వింత ప్రాపర్టీ వాయుసేన నూతన వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ ఇందర్‌పాల్ సింగ్ వాలియా దర్శి నియోజకవర్గం లోని కూటమి జడ్పీటీసీ అభ్యర్థుల విజయం తద్యం. __Dr. గొట్టిపాటి లక్ష్మీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్ర, హర్యానా పర్యటన వారణాసి-న్యూఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం శ్రీలంక మత్స్య రంగానికి భారత్ 430 ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌ల అందజేతకు ఒప్పందం! కమలం గుర్తుకు ఓటెయ్యండి - బిజెపి నేత కోలా ఆనంద్ ప్రతిష్టాత్మక 'ఏబీయూ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్' అవార్డు కైవసం! జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపునకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ ఈటల రాజేందర్‌ ఏలూరు నగర అభివృద్ధికై బ్లాక్ బోర్డు గుర్తుకు ఓటెయ్యండి టిడిపి, జనసేన, బిజెపి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలి -- విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు సేవ గుణం. చాటుకున్న ఉపాధ్యాయుడు. తన జీతం డబ్బులతో ముప్పై వేల రూపాయలు పిల్లలకు వైట్ డ్రస్ లు.

సిగరెట్ల ముసుగులో మోసం

Select Suryaa Now
సిగరెట్ల ముసుగులో మోసం

  తుర్కపల్లి మేజర్ న్యూస్): ప్రముఖ బ్రాండ్ల పేర్లు, ట్రేడ్‌మార్కులు, ప్యాకింగ్‌లను అనుకరిస్తూ నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును తుర్కపల్లి పోలీసులు రట్టు చేశారు.ఎస్‌హెచ్‌ఓకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం రంగా ఫంక్షన్‌ హాల్‌ ఎదురుగా వాహన తనిఖీలు చేపట్టి భారీగా నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.తుర్కపల్లి ఎస్సై ఎం. శివకృష్ణ తెలిపిన కథనం ప్రకారం......ఈ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన మెదిశెట్టి సురేందర్‌ను అరెస్టు చేశారు.హైదరాబాద్‌లోని బేగంబజార్‌ నుంచి AP-29-BU-8155 నంబరు గల వాగన్‌ఆర్‌ కారులో సిగరెట్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తనిఖీల్లో గోల్డ్‌ ప్లేక్‌ కింగ్స్‌, గోల్డ్‌ ప్లేక్‌ లైట్‌, గోల్డ్‌ ప్లేక్‌ లైట్‌ స్మాల్‌, వీల్స్‌ ప్లేక్‌, మార్ల్‌బరో బ్రాండ్లకు చెందిన మొత్తం 206 కార్టన్లు, 5,110 బాక్సులు, 51,100 సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కారు, మొబైల్‌ ఫోన్‌ను సీజ్‌ చేశారు.విచారణలో బేగంబజార్‌కు చెందిన కైలాష్‌ యాదవ్‌ వద్ద ఒక్కో కార్టన్‌ను రూ.60 వేలకు కొనుగోలు చేసి,తుర్కపల్లి మండలంలోని పాన్‌షాపులకు రూ.80 వేలకు విక్రయిస్తున్నట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. క్రైమ్‌ నంబర్‌ 212/2026తో బీఎన్‌ఎస్‌, కాపీరైట్‌ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు హాజరుపరిచారు. యాదగిరిగుట్ట రూరల్‌ సీఐ ఎం.శంకర్‌ ఆధ్వర్యంలో తుర్కపల్లి ఎస్‌హెచ్‌ఓ ఎం.శివకృష్ణ, పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.