కూటమితోనే సంక్షేమాభివృద్ధి
ఉదయగిరి, మేజర్ న్యూస్ : కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాతే ప్రజలకు సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్సీ, నెల్లూరు పార్లమెంట్
టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఉదయగిరి పట్టణంలోని దిలావర్భయ్వధిలో జడ్పీటీసీ అభ్యర్థిని మన్నేటి శ్రీలక్ష్మీ, బిట్-2 ఎంపీటీసీ అభ్యర్థిని షేక్ సాబీర గెలిపించాలని టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలన రాష్ట్రం గాడితప్పింథన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెంద సీతాయని, ప్రతిఒక్కరు వారికి ఓటేసి గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జిల్లా కలెక్టర్ హిమానుశుక్లాతో మాట్లాడి ఉదయగిరి చెక్కనగిషీ కేంద్రం అభివృద్ధికి రూ.50 లక్షలు నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబుయాదవ్, టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, మండల టీడీపీ కన్వీనర్ బయ్యన్న, టీడీపీ నాయకులు రియాజ్, తుమ్మల కిరణ్, గాజుల బాబు, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.