BREAKING
చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారానికి తెర.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ రాజకీయాల కతీతమైన సంక్షేమ, అభివృద్ధి వైఎస్ఆర్సిపి తోనే సాద్యం *సంగారెడ్డి జిల్లా టి ఆర్ ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు నియామకం* జీన్ హెన్రీ డ్యూనాంట్‌కు రెడ్ క్రాస్ ఘన నివాళి వీధి కుక్కల సంతతి నియంత్రణకు చర్యలు టీమిండియా చెత్త రికార్డు.. పరుగుల పరంగా చరిత్రలో అతిపెద్ద పరాజయాలు ఇవే! *డా.ఉజ్వల్ రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు* కన్నెగంటి బాలు నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి *జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కే . కన్నయ్య రైతు మట్టిని నమ్ముకుంటే.. నాయకులు మట్టిని అమ్ముకుంటున్నారా? డాక్టర్ షకీలా ముమ్మర ప్రచారం - జనం విజయాశీస్సులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు ఖాయం

పింఛను దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా చేపట్టాలి. ఏబిసి సెంటర్ (అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం) నిర్వహణకు పటిష్ట ప్రణాళిక రూపొందించాలి. :జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. :

Select Suryaa Now
పింఛను దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా చేపట్టాలి.  ఏబిసి సెంటర్ (అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం) నిర్వహణకు పటిష్ట ప్రణాళిక రూపొందించాలి. :జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. :


 సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను ఆయన సమీక్షించారు. దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళలకు సంబంధించి ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.
ఎబిసి సెంటర్ (అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం) నిర్వహణకు పటిష్ట ప్రణాళిక రూపొందించాలని వివరించారు. ఎబిసి సెంటర్ ను సమర్థవంతంగా నిర్వహించి, జిల్లాలో కుక్క కాటుల ప్రమాదాలను నివారించాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎస్ టిపి నిర్మాణాల వివరాలు సమీక్షించారు. ఎస్ టిపి అనుమతులు, వాటికి సంబంధించిన ఇతర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీల పరిధుల్లో జరుగుతున్న నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతి పొందిన ఇసుకను మాత్రమే ఉపయోగించేలా మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ ఉంచాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, డిఆర్డిఓ విజయలక్ష్మి, డివిఎహెచ్ఓ సురేష్, మైనింగ్ అధికారి తిరుపతి రావు, మున్సిపల్ కమిషనర్లు రవిబాబు, సుందర్ సింగ్, సంతోష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.