BREAKING
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి జిల్లాలో సెక్షన్ 144 పటిష్టంగా అమలు చేస్తున్నాం : కలెక్టర్ హిమాన్షు శుక్ల పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న 120 మంది ఉద్యోగులు కొనసాగుతున్న కృత్రిమ గాజుల తయారీ శిక్షణ. *మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి* గ్రామాల అభివృద్ధికి అడ్డుపడ్డారు.. ఓటుతో బదులివ్వండి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు పోలీసుల రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న యువత *నిజాయితీ చాటుకున్న విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగి ప్రశాంత్* *పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను పోలీసుల సమక్షంలో బాధితుడికి అప్పగింత* విద్యార్థుల కళా ప్రతిభకు "సాధన 2026"వేదిక అక్టోబర్ 31 నుంచి మౌలానా ఆజాద్ జయంతి ఉత్సవాలు. : విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు. పలు పంటలను క్షేత్ర సందర్శనలో పరిశీలన. శాస్త్రవేత్తలు పసల కుటుంబానికి న్యాయం చేయాలి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రతపై బాపట్ల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జిఎంఆర్ కుటుంబ వేడుకకు ప్రముఖుల హాజరు

రావివలస పంచాయతీ మాజీ సర్పంచ్ రమణ మృతి

Select Suryaa Now
రావివలస పంచాయతీ మాజీ సర్పంచ్ రమణ మృతి

చీపురుపల్లి, సూర్య : మండలంలోని రావివలస గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ గుషిడి రమణ (70) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. నాటు వైద్యం చేయడంలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. చుట్టుప్రక్క గ్రామాల ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వైద్యం కోసం ఈయనవద్దకు వచ్చేవారు. శరీరంలో ఎక్కడి ఎముకలు విరిగిన, బెణికిన రమణ చేతితో నూనె రాసి వెదురు కర్రలు, కాటన్ గుడ్డలతో కట్టే కట్టుతో మంచి ఫలితాలు వచ్చేవి. 1983 నుంచి తెలుగు దేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసారు.  2014-2019 మధ్య రావివలస సర్పంచిగా సేవలు అందించారు.  ఈయన మృతి సమాచారం తెలుసుకున్న టీడీపీ, వైసీపీ నాయకులు రమణ పార్ధీవ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.