ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు
ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు
10 మోటార్ సైకిళ్లు స్వాధీనం
ముప్పాళ్ల, న్యూస్ : మండలంతో పాటు గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి మొత్తం 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐపి అనిల్ తెలిపారు. శుక్రవారం స్టేషన్ లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. మండలంలోని మాదల గ్రామానికి చెందిన చల్లా అనిల్ కుమార్, వలాసి తరుణ్అనే ఇద్దరు వ్యక్తులు, వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించి, వాటిని తక్కువ ధరలకు, ఐదు వేల రూపాయల నుంచి సుమారు రూ.15,000 వరకు విక్రయించాలనే ఆలోచనతో ఉన్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.