BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

గ్రామాల అభివృద్ధికి అడ్డుపడ్డారు.. ఓటుతో బదులివ్వండి

Select Suryaa Now
గ్రామాల అభివృద్ధికి అడ్డుపడ్డారు.. ఓటుతో బదులివ్వండి

విడవలూరు,  మేజర్ న్యూస్ :    స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుని గ్రామాల అభివృద్ధిని ఆపాలన్న వైసీపీ కుట్రలు ఫలించలేదని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  అన్నారు. కుట్ర రాజకీయాలకు చరమగీతం పాడి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థుల గెలుపుతోనే 16వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని స్పష్టం చేశారు. 'చెప్పాం.. చేస్తున్నాం' ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విడవలూరు మండలంలోని ఊటుకూరు, ముదివర్తి, అన్నారెడ్డిపాళెం, అలగానిపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రాధాన్య క్రమంలో సమస్యలన్నింటినీ పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.

విడవలూరు జడ్పీటీసీ అభ్యర్థి చౌటూరు వెంకట శేషమ్మ గారితో పాటు ఊటుకూరు ఎంపీటీసీ అభ్యర్థి కోమట్ల మల్లీశ్వరి, ముదివర్తి ఎంపీటీసీ అభ్యర్థి షేక్ ఫాతిమా, అన్నారెడ్డిపాళెం ఎంపీటీసీ అభ్యర్థి మోర్ల మౌనిక, అలగానిపాడు ఎంపీటీసీ అభ్యర్థి పొనుగోటి శిరోమణిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో గ్రామాలకు మరిన్ని నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి అవకాశం కలుగుతుందన్నారు.

ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నాం
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు   ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  తెలిపారు. కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో పాలనను చూపిస్తోందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ.. రైతులు, మహిళలు, విద్యార్థులు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు సహా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ, మత్స్యకార సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని వివరించారు. ఒకటో తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనూ ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తూ పేద అవ్వాతాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. రైతుల హక్కులకు భంగం కలిగించేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందించామని ఎమ్మెల్యే గారు గుర్తుచేశారు. రైతుల భూములకు భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అభివృద్ధికి పెద్దపీట.. గ్రామాలకు మహర్దశ
గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి   విమర్శించారు. కనీసం రోడ్లపై తట్టెడు మట్టి కూడా వేయని పరిస్థితి నుంచి నేడు గ్రామాల్లో రోడ్లు, కాలువలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. విడవలూరు మండలంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రోడ్లు, కాలువలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. అలాగే, పేదలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పించామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

విభేదాలు పక్కనబెట్టి.. ఏకతాటిపైకి రావాలి
స్థానిక ఎన్నికల్లో వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం ఐక్యంగా పనిచేయాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ఓటర్లు రెండు ఓట్లూ సైకిల్ గుర్తుపై వేసి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించేలా చూడాలన్నారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌ను తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి కూటమి అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగవచ్చని తెలిపారు.