BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

అక్టోబర్ 31 నుంచి మౌలానా ఆజాద్ జయంతి ఉత్సవాలు. : విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు.

Select Suryaa Now
అక్టోబర్ 31 నుంచి మౌలానా ఆజాద్ జయంతి ఉత్సవాలు. : విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు.

అక్టోబర్ 31 నుంచి మౌలానా ఆజాద్ జయంతి ఉత్సవాలు. : విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు.

సూర్య నిర్మల్ ప్రతినిధి : భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 12 రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ ఉస్మాన్, మహమ్మద్ ఇంతియాజ్ తెలిపారు.

అక్టోబర్ 31న నిర్మల్‌లోని మహమ్మదీయా ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. నవంబర్ 3న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.

నవంబర్ 1 నుంచి లక్ష్మణ్‌చాంద, మామడ, సోన్, దిలావర్‌పూర్, సారంగాపూర్, నర్సాపూర్ (జి), నిర్మల్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆజాద్ దేశానికి చేసిన సేవలు, విద్యారంగ అభివృద్ధికి ఆయన అందించిన కృషిని విద్యార్థులకు, ప్రజలకు తెలియజేయడమే కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.