పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
తెనాలి, న్యూస్ : తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను వెంటనే నష్టం అంచనా వేయాలని,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములకా శివసాంబి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెనాలి ఐతానగర్, నేలపాడు, కంచర్లపాలెం, సోమసుందరపాలెం, గుడివాడ గ్రామాలలో పంట పరిశీలించి రైతులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. మరుగు కాల్వలు మరమ్మత్తు లేకపోవడం తూటాకు గుర్రపు డెక్క నగరాలు తో నిండిపోవడంతో మురుగు ప్రవాహానికి అడ్డం పడుతుందని రైతులు తెలిపారు. ఎకరానికి వారికి రూ 40 వేలు నుంచి రూ 50 వేలు పెట్టుబడి అయిందని అరటి పసుపు కంద వగైరాలు కు లక్ష పైగా పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. తెనాలి కొల్లిపర మండలంలో వేలాది ఎకరాలు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్నాయని ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇంతవరకు వరి పైరు కు ఎంత పరిహారం ఇస్తుందోప్రకటించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం మేనమేషాలు లెక్కించకుండా సత్వరమే పంట నష్టం అంచనా వేసి పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.