BREAKING
రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం చిలగడదుంప తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్ - ఒంటరిగా కనిపించిన బాలుడి ని గుర్తించి తల్లి దండ్రులకు సురక్షితం గా అప్ప గించిన పోలీసులు సాయి కిషోర్ విద్యార్థుల ప్రతిభ.. కామర్స్ కార్నివాల్‌లో విజయం పత్తి రైతులను ఆదుకోండి - క్వింటాకి రూ 12,000-00 లు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి - టి డీ పీ రాష్ట్ర నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి

సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

Select Suryaa Now
సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

                                       సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151 వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ
గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, ఐపీఎస్, పోలీసు అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో, దేశ సమగ్రతను కాపాడటంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశంలోని 562 సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని, తద్వారా ఐక్యమైన, బలమైన భారతదేశ నిర్మాణానికి పునాది వేశారని పేర్కొన్నారు.సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆదర్శ నాయకత్వం, అంకితభావం, జాతీయ ఐక్యత, సమగ్రత పట్ల ఆయన చూపిన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో ఐక్యత, సమగ్రత, దేశసేవ అనే విలువలకు కట్టుబడి పనిచేయాలని, జాతీయ సమైక్యత, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, సూపరింటెండెంట్లు మల్లికార్జున్, యజ్దానీ, హనుమా, రమాదేవి, ఎస్టేట్ ఆఫీసర్ ఆర్‌ఐ హిమాకర్, అడ్మిన్ ఆర్‌ఐ రామారావు, వెల్ఫేర్ ఆర్‌ఐ నాగరాజుతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.