BREAKING
పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం చిలగడదుంప తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్ - ఒంటరిగా కనిపించిన బాలుడి ని గుర్తించి తల్లి దండ్రులకు సురక్షితం గా అప్ప గించిన పోలీసులు సాయి కిషోర్ విద్యార్థుల ప్రతిభ.. కామర్స్ కార్నివాల్‌లో విజయం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత కరువు – గోపిక లక్ష్మిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఏఐఎస్ఎఫ్

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత కరువు                      – గోపిక లక్ష్మిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఏఐఎస్ఎఫ్

ఏలూరు, మేజర్ న్యూస్ :అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని గోపిక లక్ష్మిపై జరిగిన విచక్షణారహిత దాడి ఘటనను అఖిల భారత విద్యార్థి సమాఖ్య  ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్ తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కనీస భద్రత కూడా లేకపోవడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. రాష్ట్రంలోని నలుమూలల ప్రభుత్వ పాఠశాలల్లో ఏదో ఒక రూపంలో భద్రతా లోపాలు కనిపిస్తున్నాయని, కొన్ని పాఠశాలలకు ప్రహరీ గోడలు ఉంటే గేట్లు ఉండటం లేదని, గేట్లు ఉంటే ప్రహరీ గోడలు ఉండటం లేదని, మరికొన్ని పాఠశాలలకు కనీసం గేట్లు కూడా లేని దుస్థితి నెలకొందని విమర్శించారు.

కేవలం పాఠశాలల చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించి, గేట్లు ఏర్పాటు చేస్తే సరిపోదని, పాఠశాల ఆవరణలోకి బయటి వ్యక్తులు యథేచ్ఛగా ప్రవేశించకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు తప్పనిసరిగా వాచ్‌మెన్ లేదా సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికైనా స్పందించి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న భద్రతా లోపాలపై సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.