BREAKING
పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం చిలగడదుంప తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్ - ఒంటరిగా కనిపించిన బాలుడి ని గుర్తించి తల్లి దండ్రులకు సురక్షితం గా అప్ప గించిన పోలీసులు సాయి కిషోర్ విద్యార్థుల ప్రతిభ.. కామర్స్ కార్నివాల్‌లో విజయం

పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి..

Select Suryaa Now
పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి..

                                    నవంబర్ 6లోగా ప్రక్రియ పూర్తి చేయాలి: ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే వివేకానంద్

 కొంపల్లి మేజర్ న్యూస్  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ నవీన్ రావు, బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పార్టీ నాయకులు, బూత్ ఇంచార్జ్‌లకు సూచించారు. శనివారం పేట్ బషీరాబాద్‌లోని 132వ డివిజన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో కలిసి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, బూత్ ఇంచార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఓటరు నమోదు పరిస్థితిని సమీక్షించి, అర్హులైన పట్టభద్రులందరికీ ఓటు హక్కు కల్పించేలా చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా ప్రతి ఒక్కరూ తమ పట్టభద్రుల ఓటును నమోదు చేసుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు, కాలనీల్లోని అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. నవంబర్ 6వ తేదీతో ఓటరు నమోదు గడువు ముగియనున్న నేపథ్యంలో సమయం తక్కువగా ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని పిలుపునిచ్చారు. సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో సీఎంసీ పరిధిలోని 8 డివిజన్లతో పాటు కొంపల్లి, నిజాంపేట్, దుండిగల్ సర్కిళ్లకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, బూత్ ఇంచార్జ్‌లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.